ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి-త్రిష కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 96. 1996లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్కూల్ టీచర్‌గా త్రిష అలరించనుండగా మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌పై నందగోపాల్ నిర్మిస్తున్నారు.
నటిగా త్రిషకు ఇది 59వ సినిమా. 1996 సంవత్సరంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించారు. ఎపుడో పట్టాలెక్కిన ఈ మూవీ అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి నిర్ణయించారు. తెలుగులో ఈ చిత్రం ప్రదర్శన హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
ఇటీవల విడుదల సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుంది. ‘96’ టీజర్‌లో డైలాగ్స్ పెద్దగా ఉండవు. ఓ ఎమోషన్ కనిపిస్తుంది. జాను అనే టీచర్ పాత్రలో త్రిష కనిపిస్తారట. విజయ్ సేతుపతి కెమెరామెన్‌గా కనిపించనున్నారని టీజర్‌లో హింటిచ్చారు.