హాట్ బ్యూటీ సన్నీలియోన్‌కు సినీ ఇండస్ట్రీలో క్రేజ్ కాస్త ఎక్కువే.. సన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. సినిమాల పరంగా సక్సెస్ రేటు లేకపోయినా ఐటెం సాంగ్‌లతో సన్నీ లియోన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం సన్నీ లియోన్ భూమి చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. ఇటీవల ఈ సాంగ్ మేకింగ్ లోని కొన్ని ఫోటోలతో పాటు, సాంగ్ రిహార్సల్స్ లో భాగంగా రింగ్ తో డ్యాన్స్ చేసిన వీడియో ను కూడా షేర్ చేసింది సన్నీ.
తాజాగా ట్రిప్పి ట్రిప్పి సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో సన్నీ తన గ్రూప్ తో చేసిన సందడి అంతా ఇంతా కాదు . బ్లాక్ కలర్ డ్రెస్ లో ఈ ఐటెం బ్యూటీ మాస్త్ ఫిదా చేసింది. ఇక బాహుబలి హిందీ వర్షెన్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి వాయిస్ అందించిన శరద్ కేల్కర్ కూడా ఈ సాంగ్ లో కనిపిస్తాడు. ప్రియా సరైయా రాసిన ట్రిప్పి ట్రిప్పి పాటని నేహ కాక్కార్, బెన్నీ డయాల్, బ్రిజేష్ శాండిల్య, బాద్ షా పాడారు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో రూపొందిన భూమి చిత్రానికి సచిన్-జిగర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓసారి ఆ భీబత్సమైన పెర్ఫార్మెన్స్ చూసేయండి.