- Advertisement -
ముఖ్మమంత్రి కేసీఆర్ తో ఆదివాసి ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీ లోని సీఎం ఛాంబర్ లో వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆదివాసి ప్రాంతాల్లోని పోడు భూములు సమస్యలను సీఎం విన్నవించారు ఎమ్మెల్యేలు. సీఎం ను కలిసిన వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పోడం వీరయ్య, రేగ కాంతారావు, ఆత్రం సక్కు లు కలిశారు.
దీనిపై స్పందించిన సీఎం ఫిబ్రవరి మొదటివారంలో ఆదివాసీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు తెలిపారు.అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో గిరిజన, గిరిజనేతర భూముల సమస్యలు పరిష్కరించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ములుగును జిల్లాగా ఏర్పాటు చేసినందుకు కెసిఆర్‌కు సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -