శివ‌రాత్రి రోజు ‘మ‌హ‌ర్షి’ స్పెషల్ గిప్ట్..

251
Maharshi
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు . ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా..పూజా హెగ్డె క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. హీరో అల్ల‌రి న‌రేష్ ఈమూవీ ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వీనిద‌త్ లు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Mahesh

ఇప్ప‌టికే 80శాతం చిత్ర‌క‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈమూవీని ఎప్రిల్ 5న లేదా 26వ తేదిన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఈచిత్రం నుంచి రెండు ఫ‌స్ట్ లుక్ ల‌ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. ఈపోస్ట‌ర్స్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా ఈమూవీ నుంచి మ‌రో అనౌన్స్ మెంట్ ను ప్ర‌క‌టించారు.

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చి4వ తేదిన మ‌హ‌ర్షి టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అదే రోజున ఈచిత్ర రిలీజ్ డేట్ ను కూడా ఖ‌రారు చేస్తార‌ని తెలుస్తుంది. మ‌హేశ్ త‌రువాతి సినిమా సుకుమార్ తో ఉండ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే నెల నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం.

- Advertisement -