మొక్కలు నాటిన జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్

217
KarimNagar Jc

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. గ్రీన్‌ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ కెప్టెన్ మధుసుధన్ రెడ్డి విసిరిన గ్రీన్ చాలెంజ్ స్వీకరించారు కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. తన క్యాంపు కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.

అదే విధంగా మరో ఐదుగురికి (జొగినపల్లి రవీందర్ రావు(సంతోష్ కుమార్ రాజ్య సభ సభ్యులు తండ్రి), మానకొండూర్ ఎం.ల్.ఎ. రసమయి బాలకిషన్, శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి, హిందు దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్ దయా శంకర్, ఎన్.ఆర్.ఐ., కళేక ఫౌండేషన్ చైర్మన్ నారాయణ, ప్రముఖ సాహితి వేత్త మాడిశెట్టి గోపాల్ కు జే.సి. గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమం లో శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ కెప్టెన్ మధుసుధన్ రెడ్డి, జే.సి. క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.