తండ్రికి షాకిచ్చిన ప్రియాంక సింగ్ అలియాస్ జబర్దస్త్ సాయి !

486
bigg boss
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకోగా 5వ సీజన్‌ ఆదివారం నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 19 మంది సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగా బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ హౌస్‌లోకి అడుగుపెట్టింది.

జబర్దస్త్‌లో సాయితేజగా అందరిని మెప్పించిన సాయి తర్వాత ప్రియాంక సింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక సింగ్. ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టుకున్నారు. మా నాన్న తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తన పెళ్లి గ్రాండ్‌గా చేయాలనుకున్నారని కానీ తాను ఇలా మారినట్టు మా నాన్నకు తెలియదన్నారు. ఇదే వేదిక నుండి మా నాన్నకు తాను ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు చెబుతున్నానని తెలిపి కన్నీటి పర్యంతమయ్యారు ప్రియాంక. అయితే తనకు నచ్చినట్లు మారిన విషయం అమ్మకు తెలుసని…అమ్మ సపోర్టు తనకు వందశాతం ఉంటుందని తెలిపారు.

మొత్తంగా సిరి హన్మంతు, వీజే సన్నీ, లహరి, శ్రీరామ చంద్ర, అనీ మాస్టర్, లోబో, ప్రియా, మోడల్ జెస్సీ, ట్రాన్స్ జెండర్, ప్రియాంక, షన్ముఖ్ జశ్వంత్, హమీద, నటరాజ్ మాస్టర్, 7 ఆర్ట్స్ సరయు, విశ్వ, ఉమాదేవి, మానస్, ఆర్జే కాజల్ , శ్వేత, యాంకర్ రవితో కలసి మొత్తం 19 మందితో హౌస్ కళకళలాడిపోతోంది.

- Advertisement -