ట్రైన్ జర్నీ చేస్తున్నారా..మీ కోసమే!

16
- Advertisement -

దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు చాలామంది ట్రైన్ జర్నీ చేసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే ట్రైన్ లో సౌకర్యవంతంగా, అన్ని వసతులతో ప్రయాణం చేయవచ్చని భావించి రైలు ప్రయాణాన్ని ఎన్నుకుంటారు. నిజమే ట్రైన్ లో సౌకర్యవంతంగా గమ్యస్థానాన్ని చేరవచ్చు. అయితే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తిన లేదా ఏదైనా ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు కనిపించినా.. చాలమందికి ఏం చేయాలో తెలియదు. అలాగే ట్రైన్ ఎక్కడుంది ? సీట్ బుకింగ్ ? వంటి సమాచారాన్ని తెలుసుకోవాలన్న కూడా చాలమందికి తెలియదు. అలాంటి వారికోసం రైల్వే సంస్థ అధికారిక పోన్ నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా !

* ట్రైన్ జర్నీ చేసే టైమ్ హటాత్తుగా ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాదు. పైగా బస్సులో మాదిరి మద్యలో దిగిపోవడానికి కూడా వీలుండదు. అందువల్ల ఆ టైమ్ లో చాలామంది కంగారు పడిపోతుంటారు. అయితే అలాంటి ఇబందులను తగ్గించేందుకు రైల్వే సంస్థ 138 నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెంబర్ కు కాల్ చేసే సమాచారాన్ని రైల్వే అధికారులకు చేరేవేయచ్చు. ఆరోగ్య పరమైన సమస్యలే కాకుండా ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్న ఈ నెంబర్ కు కాల్ చేస్తే నెక్స్ట్ స్టేషన్ లో పోలీసులు అందుబాటులోకి వస్తారు.

* చాలమంది ట్రైన్ బుకింగ్ స్టేటస్ లు తెలుసుకోవడానికి రకరాల యాప్స్ ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా రైల్వే సంస్థ అధికారిక నెంబర్ 9881193322 అనే నెంబర్ ను మొబైల్ లో సేవ్ చేసుకుంటే వాట్సప్ ద్వారా ట్రైన్ లైవ్ లొకేషన్, సీట్ బుకింగ్ వంటి అన్నీ రకాల సమాచారాన్ని వాట్సప్ చాట్ ద్వారా పొందవచ్చు.

* ట్రైన్ లో చాలమంది ఫుడ్ కోసం ఇబ్బంది పడుతుంటారు. ఆకలితో ఉన్నప్పటికి స్టేషన్ వచ్చే వరకు అలాగే ఉంటారు.. అయితే ఐఆర్సీటీసీ వారి అధికారిక క్యాటరింగ్ నెంబర్ 8750001323 కు కాల్ చేసి ట్రైన్ లో ఉన్న చోటుకే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.

కాబట్టి ట్రైన్ జర్నీ చేసేవారు పై మూడు నెంబర్స్ ను తప్పనిసరిగా మొబైల్ లో సేవ్ చేసుకోవాలి.

Also Read:అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

- Advertisement -