TRAI:ఇకపై 30 రోజుల రీఛార్జ్ వ్యాలిడిటీ!

2
- Advertisement -

దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు టెలికాం కంపెనీలు అమలు చేస్తున్న 28 రోజుల రీఛార్జ్ సైకిల్‌కు స్వస్తి పలుకుతూ, ఇకపై పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ‘టెలికాం వినియోగదారుల రక్షణ (13వ సవరణ) నిబంధనలు, 2026’ పేరుతో కొత్త మార్గదర్శకాలను ట్రాయ్ అధికారికంగా విడుదల చేసింది.

ఇప్పటివరకు ఉన్న 28 రోజుల ప్లాన్ల వల్ల వినియోగదారులు 12 నెలల సంవత్సరంలో 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల ఏటా ఒక అదనపు నెల రీఛార్జ్ భారం వినియోగదారులపై పడేది. ఈ అంశాన్ని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా పార్లమెంట్‌లో లేవనెత్తగా, ట్రాయ్ సానుకూలంగా స్పందించింది. కొత్త నిబంధనలతో ఇకపై ఏడాదికి 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది, వినియోగదారులకు ఆర్థిక ఊరట లభిస్తుంది.

ఇంటర్నెట్ అవసరం లేని సాధారణ ప్రజలు, వృద్ధులు మరియు గ్రామీణ ప్రాంత వినియోగదారుల కోసం ట్రాయ్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ (SMS) సేవలు మాత్రమే అందించే చౌకైన ప్లాన్లను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని కంపెనీలను ఆదేశించింది.

టెలికాం సంస్థలు ఈ నూతన రీఛార్జ్ ఆప్షన్లను త్వరలోనే అందుబాటులోకి తేనున్నాయి. ట్రాయ్ తీసుకున్న ఈ సవరణల వల్ల దేశంలో కోట్లాది మంది ప్రీపెయిడ్ వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

Also Read:పాక్‌కు ఉగ్రవాదం అలవాటే!

- Advertisement -