బ్యాంకు,ఫుడ్,డెలివరీ ఏదైనా ఓటీపీలు తప్పనిసరి. చివరి కొరియర్ సర్వీసులు కూడా ఓటీపీ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఇది కస్టమర్ల భద్రతకు ఉపయోగపడుతున్న కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో టెలికాం రెగ్యులెటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) కీలక నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 1 నుండి నకిలీ కాల్‌లు, సందేశాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకురానుంది. ట్రాయ్ నిబంధనలకు విరుద్దంగా వచ్చే SMS లేదా Android యాప్ APK ఫైల్‌లను బ్లాక్ చేయాలని TRAI నిర్ణయించింది. ఈ లింక్ లేదా మెసేజ్‌పై క్లిక్ చేయడం ద్వారా, హ్యాకర్లు మొబైల్ నుండి మొత్తం సమాచారాన్ని, డబ్బును లాక్కుంటారు. ఇలాంటి మోసాలు జరగకుండా ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంది.
డిసెంబర్ 1 నుండి ఓటీపీ ప్రాతిపదికన పనిచేసే యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు, వారి పేరు నమోదు చేయకపోతే, వారు పంపిన సందేశం లేదా OTP కస్టమర్ ఫోన్‌కు చేరదు. బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్ల నుండి Zomato, Uber వంటి యాప్‌ల వరకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
Also Read:TTD: పీఏసీ-5 భవన నిర్మాణ పనులపై రివ్యూ