భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్….

136
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన భీమ్లానాయక్‌ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా ఇక ఇవాళ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ లైన్స్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా పవన్ సరసన నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయగా సాగర్ చంద్ర తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది.

ఇక ఇవాళ ప్రీ రిలీజ్ వేడుక నేపథ్యంలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మైత్రివనం నుంచి యూసఫ్‌గూడ వైపు వచ్చే వాహనాలు, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి యూసఫ్‌గూడ వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నామని వెల్లడించారు. వాహనదారులు ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

కాగా, ప్రత్యేకంగా జారీ చేసిన పాస్‌లు ఉన్నవారు మాత్రమే ప్రీ రిలీజ్‌ వేడుకకు రావాలని, పాస్‌లు లేని వారు రావద్దన్నారు. ఈ నెల 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి లేదని, నేటి తేదీతో ఉన్న పాసులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.

- Advertisement -