రష్యాపై అమెరికా ఆంక్షలు..ఉక్రెయిన్‌ వీడండి..భారత్

94
biden
- Advertisement -

ఉక్రెయిన్‌పై దాడికి రష్యా మరింత దూకుడు పెంచింది. ఉక్రెయిన్‌లో రెబెల్స్‌ అధీనంలోని రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించిన రష్యా, మంగళవారం వాటిలోకి భారీగా సైన్యాన్ని నడిపి అగ్నికి మరింత ఆజ్యం పోసింది. తాము ప్రకటించిన స్వతంత్ర హోదా రెబల్స్‌ నుంచి ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకూ వర్తిస్తుందని తెలిపింది.

ఇక రష్యా తీరుపై భగ్గుమంటున్న అగ్రరాజ్యం.. అందరూ అనుకున్నట్లే ఆంక్షలకు తెరలేపింది. రష్యా… అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించిందన్న బైడెన్… ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించారు.

ర‌ష్యా- ఉక్రెయిన్ మ‌ధ్య ప‌రిస్థితులు మ‌రింత క్షీణించిన నేప‌థ్యంలో భార‌త విదేశాంగ శాఖ ఉక్రెయిన్‌లో నివ‌సిస్తున్న భార‌తీయుల‌కు మ‌రో మారు కీల‌క సూచ‌న చేసింది. వీలైనంత త్వ‌ర‌గా ఉక్రెయిన్ నుంచి భార‌త్‌కు తిరిగి రావాల‌ని తాజాగా కీల‌క సూచ‌న చేసింది. ఆన్‌లైన్ క్లాసుల స‌మాచారం కోసం అక్క‌డే వేచి చూడ‌కుండా… వెంట‌నే ఉక్రెయిన్‌ను వీడాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

- Advertisement -