ఈ రూట్లో మూడు నెలల ట్రాఫిక్ ఆంక్షలు

179
- Advertisement -

పది నిమిషాలు ఆఫీస్‌కు లేటు అయితే బాస్‌ ఆరుస్తారు. కానీ మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఇంతకి ఎందుకో తెలుసా…రసూల్‌పురా- రాంగోపాల్‌పేట మధ్య నాలా పనుల కారణంగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆంక్షలు నవంబర్‌18 నుంచి వచ్చే యేడాది ఫిబ్రవరి 16వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

  1. బేగంపేట ఫ్లై ఓవ‌ర్ నుంచి వాహ‌న‌దారుల‌కు ర‌సూల్‌పురా టీ జంక్ష‌న్ వ‌ద్ద రైట్ ట‌ర్న్‌కు అనుమ‌తి ఇవ్వ‌రు. కిమ్స్ హాస్పిట‌ల్‌, మినిస్ట‌ర్ రోడ్, రాణిగంజ్, న‌ల్ల‌గుట్ట‌, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహ‌నాలు.. సీటీవో ఫ్లైఓవ‌ర్ కింద‌ యూట‌ర్న్ తీసుకొని హ‌నుమాన్ టెంపుల్ బై లేన్ మీదుగా డైవ‌ర్ష‌న్ తీసుకొని ఫుడ్ వ‌ర‌ల్డ్, సింధి కాల‌నీ, రామ్‌గోపాల్‌పేట పీఎస్, మినిస్ట‌ర్ రోడ్, కిమ్స్ హాస్పిట‌ల్ వెళ్లొచ్చు.
  2. రాణిగంజ్‌, న‌ల్ల‌గుట్ట‌, పీవీఎన్ఆర్ మార్గ్ నుంచి వ‌చ్చే వాహ‌న‌దారులను ర‌సూల్‌పురా వైపు అనుమ‌తించ‌రు. రాంగోపాల్‌పేట పీఎస్ వ‌ద్ద రైట్ ట‌ర్న్ తీసుకొని సింధి కాల‌నీ, ఫుడ్ వ‌ర‌ల్డ్, హ‌నుమాన్ టెంపుల్ వ‌ద్ద లెఫ్ట్ ట‌ర్న్ తీసుకొని ర‌సూల్‌పురా వైపు వెళ్లొచ్చు.
  3. సికింద్రాబాద్ నుంచి కిమ్స్ వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు హ‌నుమాన్ టెంపుల్ బై లేన్ వ‌ద్ద డైవ‌ర్ష‌న్ తీసుకోవాలి. ఫుడ్ వ‌ర‌ల్డ్, సింధి కాల‌నీ, రాంగోపాల్‌పేట పీఎస్, లెఫ్ట్ ట‌ర్న్ తీసుకొని మినిస్ట‌ర్ రోడ్డు మీదుగా కిమ్స్ చేరుకోవ‌చ్చు. లేదా సీటీవో, ప్యార‌డైస్, రాణిగంజ్ వ‌ద్ద రైట్ ట‌ర్న్ తీసుకొని కిమ్స్ చేరుకోవ‌చ్చు.

ఇవి కూడా చదవండి..

రెండో దశ కంటి వెలుగుకు శ్రీకారం

టమోటా తో ఆరోగ్యం….

బాహుబలిని మించిన ఆర్‌ఆర్‌ఆర్‌…

 

- Advertisement -