హైదరాబాద్‌లో నెల రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..

298
Narayanguda Flyover
- Advertisement -

హైదరాబాద్ నారాయణగూడలో నెల రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. నారాయణగూడ పరిసర ప్రాంతాలలో మూడు చోట్ల 1800 ఎంఎం సివరేజ్ పైపు లైన్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మే 4వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. నారాయణగూడ సెమెట్రీ గేట్ నెం.1 నుంచి గేట్ నెం.2, నారాయణగూడ సెమెట్రీ గేట్ నెం. 2 నుంచి విఠల్‌వాడి, రాజమెహల్లా దర్గా నుంచి కాచిగూడ ఎక్స్ రోడ్స్ వరకు ఈ పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందన్నారు.

()ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వైఎంసీఏ, కింగ్ కోఠికి సెమెట్రీ ద్వారా వెళ్లే వాహనాలకు అనుమతి ఉండదు, ఈ వాహనాలను ఓల్డ్‌ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హిమాయత్‌నగర్, హైదర్‌గూడ వైపు మళ్లిస్తారు.

() కింగ్‌కోఠి నుంచి ఓల్డ్‌ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లే వాహనాలను సెమెట్రీ జంక్షన్ వద్ద విఠల్‌వాడీ వైపు మళ్లిస్తారు.

()విఠల్‌వాడీ, రాంకోఠి వైపు నుంచి ఓల్డ్‌ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వెళస్త్ల్ర వాహనాలను సెమెట్రీ జంక్షన్ నుంచి ఈడెన్ ఇడెన్ గార్డెన్, కింగ్‌కోఠి వైపు మళ్లిస్తారు.

()వైఎంసీఏ నుంచి కాచిగూడ ఎక్స్ రోడ్డుకు వెళ్లే వాహనాలను బర్కత్‌పురా చమాన్, విఠల్‌వాడీ వైపు మళ్లిస్తారు.

() రాంకోఠి ఎక్స్‌రోడ్స్, నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లే రూట్ వాహనాలు కాచిగూడ ఎక్స్ రోడ్డు వద్ద వైఎంసీఏ, బర్కత్‌పురా పోస్టాఫీస్, బర్కత్‌పురా చమాన్, టూరిస్ట్ హోటల్ మీదుగా వెళ్లాలి.

- Advertisement -