మహేష్…మహర్షి సెన్సార్ పూర్తి

408
maharshi censor
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డె కథానాయికగా నటించగా..అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటించారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈచిత్రాన్ని దిల్ రాజు, అశ్వినిదత్, పివిపిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్‌ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోండగా మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. సింగిల్ కట్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ టాక్ ప్రకారం సినిమా చాలా బాగా వచ్చిందని.. మహేష్ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందని తెలుస్తోంది.

- Advertisement -