హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీ మార్పులు..

93
hyd
- Advertisement -

హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై త్వరలో ఆంక్షలు విధించనున్నారు. రద్దీ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను పెట్టే యోచనలో ఉంది ప్రభుత్వం. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, లంగర్‌హౌజ్, నానల్ నగర్,రవీంద్రభారతి, కంట్రోల్ రూమ్‌తోపాటు పలు జంక్షన్లలో మార్పులు చేయనున్నారు.

మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వాహనాలన్నింటినీ నేరుగా..పంజాగుట్టకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. పిల్మ్‌నగర్ నుంచి రోడ్డు నెంబర్ 10 వైపు వెళ్లే వాహనాలన్నింటినీ..జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఫ్రీ లెప్ట్ ఇచ్చి మళ్లింపు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సక్సెస్ అయిన ఫ్రీలెప్ట్…ఆర్టీసీ క్రాస్ రోడ్డు జంక్షన్ల మాదిరిగానే అన్నింటినీ తయారు చేసే యోచనలో ఉంది.

వాహనాలు జంక్షన్ల వద్ద నిలిచిపోకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీతో వాహనదారుల ఇక్కడ్లు పడుతున్నట్లు గుర్తించారు. రద్దీగా ఉండే జంక్షన్ల మార్పులపై ప్రణాళికలు సిద్ధం చేయగా వారంరోజుల్లో రద్దీ జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహిస్తాం అని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ చెప్పారు.

- Advertisement -