నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

253
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగోసారి వేడుకలకు గోల్కోండ కోట సర్వాంగ సుందరంగా ముస్తమైంది. చారిత్రక గోల్కొండ కోట విద్యుత్‌దీప కాంతులతో వారసత్వ సంపద ధగధగలాడుతున్నది. మరోవైపు కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీస్‌శాఖ భారీబందోబస్తు ఏర్పాటుచేసింది. వేడుకలు జరిగే హైదరాబాద్‌లోని గోల్కొండ కోట పరిసరాల్లో ఐదువేల మంది పోలీసులను మోహరించింది. పంద్రాగస్టు వేడుకలకు చారిత్రక గోల్కొండకోటను అన్ని రకాల హంగులతో ముస్తాబు చేశారు.

Golkonda11

వేడుకలకు ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చే రూట్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట రోడ్డును మూసివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. వేడుకల నేపథ్యంలో గోల్కొండ, ఆ పరిసర ప్రాం తాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చేప ట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, వేడుకలకు హాజరయ్యే ప్రజలు హ్యాండ్ బ్యాగ్‌లు, బ్రీఫ్‌కే సులు, కెమెరాలు, టిఫిన్స్ లాంటి వస్తువులను తీసుకురావద్దని ఆయన సూచించారు. ఈ రక మైన వస్తువులను వెంట తెచ్చుకుంటే వారిపై చర్య లు ఉంటాయని సీపీ తెలిపారు.

Golkonda

పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల సందర్భంగా తివో లి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బండ్, ఎన్‌సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అమలులో ఉంటాయి.

గవర్నర్ రాజ్‌భవన్‌లో మంగళవారం సాయం త్రం 5.30 గంటలకు ఇచ్చే తేనేటి విందు సం దర్భంగా రాజ్‌భవన్ రోడ్డులో సాయంత్రం 4.30 గంటల నుంచి నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కమిషనర్ మహేం దర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం వరకు రోడ్డుకు రెండు వైపులా వెళ్లే సాధారణ వాహనాలు ప్రత్యామ్నా య రూట్లలో వెళ్లాలని సూచించారు.

- Advertisement -