గాలి.. గోలీ.. నహీ చెలేగా

165
PM Narendra Modi says GST boost for federalism
PM Narendra Modi says GST boost for federalism
- Advertisement -

భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం, ఈ వేడుకలకు హాజరైన వారికి చేతులు ఊపుతూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు, రాజ్ ఘాట్ వద్ద మోదీ నివాళులర్పించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కాగా, ఈ వేడుకల్లో కేంద్రమంత్రులు, ఎంపీలు, మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్, దేవెగౌడ, విదేశీ అతిథులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, ‘భారత ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన మహానుభావులను ఈ సందర్భంగా స్మరించుకోవాలి. నవ భారత నిర్మాణానికి అందరూ కృషి చేయాలి’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ప్రభుత్వ వ్యవహారాలను బలోపేతం చేసే కార్యక్రమాల్లో వేగం పుంజుకున్నామన్నారు. ఇంటింటికీ గ్యాస్ పొయ్యిల ద్వారా కోట్లాది మహిళలకు పొగ నుంచి విముక్తి కల్పించామన్నారు. ప్రభుత్వ నిబంధనల బంధనాల నుండి విముక్తి కల్పించే ప్రయత్నం కొనసాగుతందన్నారు. తీవ్రవాద వ్యతిరేక పోరాటానికి, భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చురుకుగా మద్దతునిస్తున్నాయన్నారు.

కశ్మీర్ అభివృద్ది , ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ దేశం కట్టుబడి ఉందన్నారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వంతో కలిసి అక్కడి ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. కొన్ని సమస్యలు తుపాకులు, బుల్లెట్లు, తిట్లతో పరిష్కారం కావని, ప్రజలు ఒకరికొకరు మమేకమైనప్పుడే దేశసమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. భుజం భుజం కలిపి నడిపినప్పుడే శత్రువుకు సమాధానం చెబుతామన్నారు. దేశంలోని మూలమూలకు విద్యుత్ వెలుగులు వెళ్తున్నాయన్నారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓఆర్‌ఓపీని అమల్లోకి తెచ్చామన్నారు.

తక్కువ సమయంలోనే జీఎస్టీనీ ఎలా అమలు చేశారంటూ ప్రపంచం ఆశ్చర్యపోతుందన్నారు. జీఎస్టీని తీసుకొచ్చి సహకార సమాఖ్య వ్యవస్థకు కొత్త జవసత్వాలు అందించామన్నారు. భారతదేశంలో ఉన్న నిబద్దత, సాంకేతికలో ఉన్న నైపుణ్యత జీఎస్టీని సుసాధ్యం చేసిందన్నారు.

ఈ దేశం నిజాయితీపరులది.. అక్రమార్కులకు, అవినీతిపరులకు స్థానం ఉండబోదన్నారు. నేడు నిజాయితీని సెలబ్రేట్ చేసుకుంటున్నామని, రూ .800 కోట్ల బినామీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఇది కొత్త విశ్వాసాన్ని ఇస్తుందన్నారు. అప్పుడే సామాన్యుడికి విశ్వాసం వస్తుందన్నారు మోడీ. మనం 9 నెలల్లో మార్స్ చేరుకోవచ్చు కానీ 42 ఏళ్ల రైలు ప్రాజెక్టులు మాత్రం ఆగిపోయాయన్నారు. మేము ఇటువంటి విషయాలు పరిష్కరించడానికి దృష్టి సారించామని తెలిపారు ప్రధాని.

- Advertisement -