ట్రాఫిక్‌ పరిష్కారానికి అన్నివిధాల చర్యలు..

230
- Advertisement -

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పరిష్కారాలు చేపట్టినట్లు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్రం సహకారంతో మహానగరంలో నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు జీహెచ్‌ఎంసీ అంకురార్పణ చేసింది. అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు, ఆరాంఘర్, మెదక్ రోట్ల విస్తరణ పనులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..

Traffic congestion will be eased:KTR

తెలంగాణకు సహకరిస్తున్న కేంద్రమంత్రి గడ్కరీకి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. నితిన్ గడ్కరీ కార్యదక్షతను సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రస్తావించినట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నితిన్ గడ్కరీ మద్దతు ఎంతో ఉందన్నారు. ఉప్పల్ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. 54 జంక్షన్‌లలో ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -