కర్ణాటక ప్రభుత్వం ట్రాఫిక్ చలనాలపై 50 శాతం రాయితీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 వరకు రాయితీ ద్వారా ట్రాఫిక్ చలనాలు చెల్లించే అవకాశం కల్పించారు. అయితే కర్ణాటక సీఎం సిద్దరామయ్య కారుపై ట్రాఫిక్ చలనాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది.
సీఎం సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై మొత్తం 7 ఉల్లంఘనలు నమోదయ్యాయి. సీటు బెల్ట్ ధరించకపోవడం ఆరు సార్లు, అలాగే అతివేగం కారణంగా ఒకసారి చలానా పడింది. దీంతో డిస్కౌంట్ పథకాన్ని ఉపయోగించి రూ.8,750 చెల్లించారు అధికారులు.
ప్రభుత్వం ఈ పథకం కింద వాహనదారులు జరిమానాలో సగం మొత్తాన్ని చెల్లిస్తే, మిగతావి మాఫీ చేస్తామని ప్రకటించింది.ఆగస్టు 21న ప్రారంభమైన ఈ స్కీమ్ సెప్టెంబర్ 19 వరకు అమల్లో ఉండనుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read:చంద్రమోహన్ దర్శకత్వంలో #నరేష్65

