గో బ్యాక్ మోడీ…కార్మిక సంఘాల నిరసన

155
pm modi
- Advertisement -

సింగరేణి, విద్యుత్, ఎన్టిపిసి తదితర రంగాల్లో ప్రైవేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నవంబర్ 12వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోది వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ గో బ్యాక్ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ,బొగ్గు బావుల అమ్మకం నిలిపివేయాలని , విద్యుత్ సంస్కరణల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో టిఆర్ఎస్కెవి రాష్ట్ర అధ్యక్షుడు జి రాంబాబు యాదవ్, ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు విజయ్ కుమార్,ఏఐటియుసి రాష్ట్ర నాయకులు బాలరాజ్,సిఐటియు రాష్ట్ర నాయకులు భూపాల్ జి వెంకటేష్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నేషనల్ మాని డైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల ను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.సింగరేణి నాలుగు బొగ్గు బావులను అమ్మకాలకు పెడుతుందని,ఎన్ టి పి సి లో ప్రైవేటీకరణకు పావులు కలుపుతూ చర్యలు తీసుకుంటుందని వారు ఆరోపించారు.

అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం 2022 బిల్లు ద్వారా రైతాంగానికి,పారిశ్రామిక విధానానికి కోట్లాది ప్రజలపై తీవ్రమైన భారం పడడంతో పాటు నష్టం జరుగుతుందని అన్నారు.నాలుగు లేబర్ కోడ్ ల ద్వారా దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హరించేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగిస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకింగానే ఈనెల తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ రాకని వ్యతిరేకించడంతోపాటు మోడీ గో బ్యాక్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్రంలో ఉన్న యావత్ కార్మిక లోకం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తమ న్యాయమైన సమస్యలు డిమాండ్లను పరిష్కరించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈనెల 12వ తెలంగాణ రాష్ట్రానికి మోడీ రాక నిరసిస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కార్మిక సంఘాల నేతలు నల్ల బ్యాడ్జిలు ధరించి వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -