మోదీ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు నిరసనగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 3న నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హిందూ మజ్దూర్ సభ, సీఐటీయూ, టీయూసీసీ వంటి పది కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపు ఇచ్చినట్టు కార్మిక సంఘాల సంయుక్త ఫోరం ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రైవేటీకరణ సహా బడ్జెట్‌లో పొందుపరిచిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చినట్లు వెల్లడించాయి. లేబర్ కోడ్స్‌ను రద్దు చేయడంతో పాటు పేద కార్మికులకు ఆహారం, ఆదాయం కల్పించాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల సంయుక్త ఫోరం డిమాండ్ చేసింది.
నిరసనల్లో భాగంగా భారీ ప్రదర్శనలు, కార్యస్ధానాల్లో సమావేశాలు నిర్వహించి లేబర్ కోడ్స్‌ను ప్రతులను దగ్ధం చేస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధ్వంసకర విధానాలకు నిరసనగా భవిష్యత్‌లో తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.