కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ నుండి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నటించబోయే ప్రధాన మహిళా పాత్రలను పరిచయం చేస్తూ ‘టాక్సిక్ లేడీస్ లేడీస్’ పేరుతో ఒక ప్రత్యేక టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఈ సరికొత్త టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇందులో కనిపించిన మహిళా నటీమణుల లుక్స్ మరియు వారి పాత్రల పరిచయం ఎంతో పవర్‌ఫుల్‌గా, విభిన్నంగా ఉంది. అయితే ఈ టీజర్ చివర్లో మేకర్స్ ఒక ఆసక్తికరమైన హెచ్చరికను కూడా జోడించారు. ఈ సినిమాలోని లౌడ్ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో “పిల్లలు దీనికి దూరంగా ఉండాలి అంటూ ఒక ఫన్నీ అండ్ సీరియస్ వార్నింగ్‌ను ఇచ్చారు.
‘కేజీఎఫ్’ (KGF) సిరీస్ తర్వాత యాష్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు టాప్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు గతంలో ప్రచారం సాగింది. తాజాగా విడుదలైన ఈ ‘లేడీస్ టీజర్’ ఆ నటీమణులందరి పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

