మొక్కలు నాటిన టూరిజం శాఖ ఉద్యోగులు..

135
gic
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా వారి పిలుపు మేరకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ నేతృత్వంలో సంస్థ ఉద్యోగులు హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడం గోల్కొండ కోటలో మొక్కలు నాటారు.

రాష్ట్ర సీఎం కేసీఆర్, మంత్రి KTR గార్ల సూచనల మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ లో భాగంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా వారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ టూరిజం MD మనోహర్ వారి ఆదేశాల అనుగుణంగా సంస్థ ఉద్యోగులు మొక్కలు నాటి స్ఫూర్తి గా నిలిచారు.

ఈ సందర్భంగా MD మనోహర్ గారు మాట్లాడుతూ..గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా సంస్థ ఉద్యోగులు మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా సందర్భం ఏదైనా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు తెలంగాణ టూరిజం MD మనోహర్.

- Advertisement -