బెంగాల్ టైగర్ సినిమా తరువాత ఏడాది గ్యాప్ తీసుకున్న రవితేజ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్‌తో సక్సెస్ బాట పట్టిన మాస్ మహారాజా ప్రస్తుతం టచ్ చేసి చూడు చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశారు.
బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్ కపూర్లు రవితేజతో జోడీ కడుతున్నారు.
‘టచ్ చేసి చూడు’ చిత్రం షూటింగ్ పూర్తైన సందర్భంగా నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. “మాకు చిరకాల మిత్రుడైన రవితేజతో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.