యుఎస్‌లో కాల్పులు..భారతీయుడు మృతి

190
Gujarati shot dead in Chicago
- Advertisement -

అమెరికాలో దుండగుడి ఘాతుకానికి మరో భారతీయుడు బలయ్యాడు. షికాగో రాష్ట్రంలోని డోల్టన్‌లో నివసిస్తున్న గుజరాత్‌ వాసి అయిన అర్షద్ వోరా అనే 19 ఏళ్ల యువకుడు.. ఆగంతుకుడి కాల్పుల్లో మరణించాడు. మరో హైదరాబాద్ వాసీ సయీద్‌కి తీవ్రంగా గాయాలయ్యాయి.  వోరాపై దాడి చేసి అతడి వద్ద ఉన్న వస్తువులను దోచుకెళ్లాడు.

గురువారం ఉదయం డోల్టన్‌లోని తమ పెట్రోల్ స్టేషన్‌లో ఉండగా గుర్తు తెలియని దుండగుడు వచ్చి కాల్పులు జరిపాడని, ఆ కాల్పుల్లో వోరా అక్కడికక్కడే మరణించగా, అతడి సమీప బంధువుకు తీవ్రగాయాలయ్యాయని స్థానిక వార్తా సంస్థలు కథనం ప్రసారం చేశాయి. దుండగుడిని పట్టుకొని అప్పగించినవారికి 12 వేల డాలర్ల నజరానా ప్రకటించారు.

 Gujarati shot dead in Chicago
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సయీద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సయీద్‌ను ఆదుకోవాల్సిందిగా విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, అమెరికాలో భారత అంబాసిడర్ నవతేజ్ సర్నాను మజ్లీస్ బచావో తెహ్రీక్ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ ట్విట్టర్ ద్వారా కోరారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా భద్రాతాధికారులు దుండగుడి ఆచూకీ కోసం ప్నయత్నిస్తున్నారు.

- Advertisement -