భారత్ లో కరోనా మహామ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 724కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇందులో 17మంది మరణించారు. కరోనా వైరస్ సోకిన 724 మందిలో 66 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇండియాలో అత్యధికంగా కేరళలో 137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 135, కర్ణాటకలో 55, రాజస్థాన్‌లో 45, తెలంగాణలో 45, గుజరాత్లో 44, ఉత్తరప్రదేశ్‌లో 42, ఢిల్లీలో 39, పంజాబ్‌లో 33, హర్యానాలో 32, తమిళనాడులో 29, మధ్యప్రదేశ్‌లో 20, జమ్మూకశ్మీర్‌లో 14, లడఖ్‌లో 13, ఆంధ్రప్రదేశ్‌లో 11, పశ్చిమ బెంగాల్లో 10, బీహార్‌లో 9, చండీఘర్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, గోవాలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, అండమాన్ నికోబార్ దీవుల్లో 2, మణిపూర్, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు నమోదైంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇటలో లో కరోనా బాధితుల సంఖ్య అత్యధికంగా ఉంది. రోజుకి వందల సంఖ్యలో మరణిస్తున్నారు.