రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 27 కరోనా పాజిటివ్ కేసులు..

385
corona in ts
- Advertisement -

తెలంగాణ రాప్ట్రంలో క్రమంగా కరోనావైరస్ విస్తరిస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 27 పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కోవిడ్-19 నుంచి కోలుకొని ఇవాళ మరో ముగ్గురు డిచ్చార్జ్‌ అయ్యారు. ఇవాళ సంగారెడ్డిలో ఆరు, నల్గగొండలో ఆరు, ములుగులో 2 కేసులు నమోదవగా.. మిగతా కేసుల వివరాలు తెలియాల్సి ఉంది.

మొత్తంగా తెలంగాణలో ఇప్పటి వరకు 154 పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 17 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా… 9 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 128 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది.

- Advertisement -