తెలంగాణ‌లో క‌రోనా కేసుల రికార్డు

215
coronavirus
- Advertisement -

దేశ వ్యాప్తంగా రోజురోజుకి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటు తెలంగాణ‌లో కూడా క‌రోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే భారీగా కేసులు న‌మోద‌య్యాయి. 3,188 నమూనాలు పరీక్షించగా, 546 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలకు చెందినవారే 458 వరకు ఉన్నారు.

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,072 కాగా, ఇప్పటివరకు 3,506 మంది డిశ్చార్జి అయ్యారు. 3,363 మంది చికిత్స పొందుతున్నారు. ఇక మరోవైపు దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ముంబై న‌గ‌రాల్లో క‌రోనా కేసులు అధికంగా వ‌స్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 14వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.

- Advertisement -