సెక్సీ సదాపై టార్చ్ లైట్‌..!

297
Torch Light On Sada’s Back
- Advertisement -

వెళ్లవయ్యా వెళ్లూ అంటూ ‘జయం’తో ప్రేక్షకుల హృదయాలకి గాలం వేసిన అందాల తార సదా.  తర్వాత తెలుగులో ఆమెకి అవకాశాలు వెతుక్కుంటు వచ్చాయి. విలక్షణ దర్శకుడు శంకర్ తీసిన ‘అపరిచితుడు’తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత సదాకి అవకాశాలు అంతగా కలిసిరాలేదు. దీంతో బుల్లితెర బాట పట్టింది సదా. బుల్లితెరపై ప్రేక్షకుల మనసుదోచిందో ఏమో కానీ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు సిద్దమైంది.

Torch Light On Sada’s Back
కోలీవుడ్‌లో శంకర్‌ దర్శకత్వంలో నటించిన ‘అన్నియన్‌’ తో పాటు మరికొన్ని హిట్‌ చిత్రాలూ సదా ఖాతాలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆమె తమిళంలో తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా అక్కడ ‘టార్చిలైట్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. రొటీన్‌ జీవితంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో సాగే కథ ఇది.

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించే మహిళలు ఎలాంటి తిప్పలు పడుతున్నారో చెప్పే సినిమా. తెల్ల చీర మీద ఎరుపు రంగు డీప్‌ నెక్‌ బ్లౌజ్‌తో వెనక్కి తిరిగిన సదా ‘టార్చ్‌లైట్‌’ ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అబ్దుల్‌ మజీద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Torch Light On Sada’s Back

- Advertisement -