- Advertisement -
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ కిరణ్ రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సుధాకర్‌పై కోటి రూపాయలు రివార్డు ఉంది. సుధాకర్ 2013 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సుధాకర్‌తో పాటు భార్య మాధవి కూడా మావోయిస్టు కొనసాగుతోంది. అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు సోమవారం లొంగిపోయారని తెలుస్తోంది.. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న సుధాకర్ అలియాస్ కిరణ్ నిర్మల్ జిల్లా సారంగాపూర్‌కు చెందినవాడు.
ఇక వీరిద్దరిపై తెలంగాణలో కూడా కేసులు ఉండటం వల్ల ఇక్కడి తీసుకొచ్చి వారిని విచారించే అవకాశం ఉంది. అయితే విచారణ నిమిత్తం వారిని తెలంగాణకు పంపే విషయంలో జార్ఖండ్ పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో కొంతమంది గత కొంతకాలంగా పోలీసులకు లొంగిపోతున్న విషయం తెలిసిందే.
- Advertisement -