2024లో ప్రపంచం వ్యాప్తంగా నమోదైన రాజకీయ, ఆర్థిక , క్రీడలు, సైన్స్ ,సాంకేతికత రంగాల్లో జరిగిన ముఖ్యమైన వార్తలను ఓ సారి పరిశీలిద్దాం. ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ 2024లో 737 మ్యాక్స్ 9 జెట్ విమానం డోర్ ప్లగ్-ఇన్‌ను కోల్పోయింది. ఈ సంఘటన వలన ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. ఆ తర్వాత, బోయింగ్ ఎట్టకేలకు దాని స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్‌ను అంతరిక్షంలోకి మొదటి మనుషుల మిషన్ కోసం చర్యలు ప్రారంభించింది.
టీ20 ప్రపంచకప్‌ను గెలుపొందడంతో 2024 భారతదేశానికి చిరస్మరణీయమైన సంవత్సరం. దక్షిణాఫ్రికాను ఓడించి టీమ్ ఇండియా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ ప్రపంచకప్‌ని గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పారు. ఒలింపిక్ హాకీలో భారత్‌కు కాంస్యం దక్కింది. అలాగ వినేష్ ఫోగట్ అంశం భారతీయులను నిరాశపర్చింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హిందువులకు, తరతరాలుగా ఉన్న చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ అయోధ్యలోని రామమందిరాన్ని శ్రీరాముడి స్థానంలో ప్రతిష్ఠించడంతో 2024 గొప్పగా ప్రారంభమైంది. అలాగే 2024లో జరిగిన భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ మూడోసారి ప్రధానిగా భాద్యతలు చేపట్టారు.
2024లో ప్రపంచంలోనే అత్యంత ఆసక్తిగా వీక్షించిన ఎన్నికలు-అమెరికా అధ్యక్ష ఎన్నికలు. రిపబ్లికన్ డోనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. తన బహుళ వెంచర్‌లతో విజయాన్ని రుచి చూసిన ఎలోన్ మస్క్‌కి 2024 గొప్ప సంవత్సరం. డొనాల్డ్ ట్రంప్‌లో భారీగా పెట్టుబడి పెట్టగా ట్రంప్ గెలిచిన అనంతరం టెస్లా షేర్లు ఆల్-టైమ్ హైకి చేరుకున్నాయి.
ఉక్రెయిన్ – రష్యా వార్ ఈ సంవత్సరం హైలైల్‌గా నిలిచిందనే చెప్పాలి. ఉక్రెయిన్ ఆగస్ట్ 2024లో రష్యాలోని కుర్స్క్ ఓబ్లాస్ట్‌లోని కొన్ని భాగాలను ఆక్రమించి స్వాధీనం చేసుకుంది. రష్యా, ఉక్రెయిన్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఇతర రంగాలలో యుద్ధంలో ఓడిపోయినప్పటికీ, కుర్స్క్‌పై తన నియంత్రణను కొనసాగించగలిగింది.
Also Read:చరిత్రలో మైలు రాయి…డిసెంబర్ 9