చర్మ సౌందర్యం కోసం..

310
Skin
- Advertisement -

అన్నికాల‌ల్లో చ‌లికాలం వ‌చ్చిందంటే చాలా స‌మ‌స్య‌లుంటాయి. అందులో కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌యితే మ‌రికొన్ని చ‌ర్మ‌స‌మ‌స్య‌లు అని చెప్పాలి. చ‌లికి చాలా మంది చ‌ర్మం పొడిబారిపోతుంది. అలాగే చ‌లితీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల శ‌రీరం ఎక్క‌డిక‌క్క‌డ ప‌గుళ్ళు తెల్ల‌గా రావ‌డం దాంతో మంట పుట్ట‌డం లాంటివి జ‌రుగుతుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

అవేంటో తెలుసుకుని మీరు కూడా ట్రై చేయండి..

-మీ చర్మ సౌందర్యం కోసం మీరు రోజూ చేసే వాటిని అస్సలు మానేయకూడదు. ఇంట్లోనే ఉన్నా సరే.
-పొడిబారిన, పగిలిన పెదవులను పదే పదే నాలుకతో తడపకూడదు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. దీనికోసం మంచి లిప్ బామ్ తప్పనిసరిగా వాడండి.
-చలికాలంలో చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. ఇలాంటప్పుడు దాన్ని గట్టిగా గీకడం వల్ల అది మరింత డ్రై అయి.. పగలడం మొదలవుతుంది.
-మామూలుగా చేసినట్లు చలికాలంలోనూ గంటల తరబడి స్నానం చేయడం వల్ల చర్మం మరింత పొడిబారే అవకాశాలు ఉన్నాయి.
-ముఖ్యంగా వింటర్ సీజన్‌లో నాచురల్, ఆర్గనిక్ సబ్బులనే వాడటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్న వారిమి అవుతాం.
-బాగా వేడి నీరు లేదా చల్లటి నీటితో స్నానం చేయడానికి బదులు గోరు వెచ్చటి నీటితో చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
-చల్లగా ఉంది కాదా నీళ్లు తాగలేకపోతున్నాం అనుకోకుండా.. పుష్కలంగా నీరు తాగడం, ఆకుకూరల్ని ఎక్కువ తినడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది.
-బొప్పాయి గుజ్జును.. నిమ్మరసంతో కలిపి రాసుకోవడం వల్ల చలికాలంలో కూడా చర్మం మిలమిలా మెరుస్తుంది.
-ఎండలేదు కదా అని సన్ స్క్రీన్ రాసుకోవడం అస్సలు మానేయకండి. సన్ స్క్రీన్ చలికాలంలోనూ మీ చర్మాన్ని దుమ్ము, ధూళి లాంటి వాటి నుంచి కాపాడుతుంది.
-మాయిశ్చరైజ్, మాయిశ్చరైజ్, మాయిశ్చరైజ్ .. ఇది చలికాలంలో మీ చర్మాన్ని రక్షించే మంత్రం. ముఖ్యంగా రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దు.

Also Read:Chandrababu:బాబు హామీల వర్షం!

- Advertisement -