CMKCR:ఘనస్వాగతం

39
- Advertisement -

బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు మహారాష్ట్రలోని ధారాశివ్‌ షోలాపూర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కి హోంమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌తో పాటుగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు దాదాపుగా 600వాహనాలతో కూడిన కాన్వాయ్ బయలుదేరింది. దాదాపు 6కి.మీ మేర సీఎం కేసీఆర్‌కి కాన్వాయ్‌ సాగింది. ముంబాయి రహదారి మీదుగా ప్రయాణిస్తున్న సీఎం కాన్వాయ్‌కి రహదారి పొడుగునా పూలు చల్లుతూ గులాబీ కాగితాలు వెదజల్లుతూ, జై తెలంగాణ జై కేసీఆర్, జై భారత్‌ నినాదాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్రలోకి ఎంట్రీ కాగానే దారిపొడుగునా దేశ్‌కినేత కైసే హో-కేసీఆర్ జైసా హో అంటూ మహారాష్ట్ర నాయకులుఉ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ధారాశివ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కి అక్కడి నాయకులు, మహిళలు సాంప్రదాయ రీతిలో హారతినిచ్చి స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ షోలాపూర్‌కు బయలుదేరారు. ఆ సమయంలో జోరుగా వాన కురుస్తున్న సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ ముందుకు సాగింది. దారిపొడుగునా బీఆర్ఎస్ అధినేతను చూసేందుకు ప్రజలు గుమిగూడారు. సెల్ఫీలు తీసుకున్నారు. స్థానిక నేతలు గజమాలతో సత్కరించారు.

షోలాపూర్ ప్రజలు అపూర్వ స్వాగతం మధ్య సీఎం కేసీఆర్‌ బాలాజీ సరోవర్ హోటల్‌కు చేరుకొని సేదతీరారు. అనంతరం సీఎం కేసీఆర్‌ బీఆర్ఎస్ నాయకుడు ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహ్వానం మేరకు భావనారుషి పేట్‌లోని వారి ఇంటికి వెళ్లి ఆతిథ్యంను స్వీకరించారు. ముండయ్య షోలాపూర్‌ ఎంపీ సేవలందించారు. ఈ సందర్భంగా ఇద్దరు సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

ధర్మన్న సాదుల్ పూర్వీకులు పాత కరీంనగర్ జిల్లా కన్నాపూర్‌ గ్రామ ప్రజలు. వీరు వృత్తిరీత్యా వలస వెళ్లి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొని రాజకీయంగా ఎదిగారు. ధర్మన్న సాదుల్ కాల క్రమంలో ప్రజా నాయకునిగా పలు పదవుల్లో రాణించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ ఆదర్శాలకు, విధానాలకు ఆకర్షితులై సీఎం కేసీఆర్ పాలనను మహారాష్ట్ర ప్రజలకు కూడా అందించాలని లక్ష్యంతో వారు ఇటీవలే సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు, ఎంపి నామా నాగేశ్వర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: బీజేపీతో దోస్తీ.. నో ఛాన్స్ !

రేపు మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి సీఎం కేసీఆర్ ఉదయం పండరీపురంలోని శ్రీవిఠల్ రుక్మిణీ దేవస్థానాన్ని సందర్శించుకుంటారు. అలాగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సర్కోలిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమంలో పాల్గొంటారు. తుల్జాభవాని అమ్మవారి దేవస్థానానికి చేరుకొని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

Also Read: బండి.. కమ్ టూ ఢిల్లీ !

- Advertisement -