టమాటా జ్యూస్…ప్రమాదమా?

44
- Advertisement -

నిత్యం వంటింట్లో ఉండే కూరగాయలలో టమాటా తప్పనిసరిగా ఉంటుంది. వంటకం ఏదైనా టమాటా లేకపోతే చాలా అసంపూర్ణంగా ఉంటుంది. టమాటా ఎన్నో పోషకాల సమ్మేళనం. ఇందులో మన శరీరానికి అవసరమైన పోషకాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గించడంలోనూ, క్యాన్సర్ కారకాలను దూరం చేయడంలోనూ టమాటా ఎంతగానో మేలు చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే టమాటాను కేవలం కర్రీ, పచ్చడి.. వంటి వాటికి మాత్రమే కాకుండా ఇంకా రక రకాలుగా ఉపయోగిస్తారు. టమాటో సాస్, జ్యూస్ వంటివి తయారు చేసుకొని సేవిస్తుంటారు. అయితే టమాటాను అధిక మొత్తంలో తీసుకుంటే ప్రమాదమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

ముఖ్యంగా టమాటా జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదట. ఎందుకంటే టమాటాలో పొటాషియం, లైకోపీన్, బీటా కెరోటిన్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువైతే శరీరంలో కొన్ని అనర్థాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టమాటాలోని పొటాషియం ఎక్కువైతే హైపర్ కలేమియా ఏర్పడే ప్రమాదం ఉందట. ఇంకా టమాటో రసం ఎక్కువగా సేవించడం వల్ల నోటి అలెర్జీలకు కూడా కారణమౌతుందట. ఇంకా కిడ్నీ సమస్యలు ఏర్పడడానికి కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా గర్భిణీ స్త్రీలకు కూడా టమాటా జ్యూస్ ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. అయితే టమాటా రసం మితంగా తీసుకుంటే చాలానే ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది. ఇంకా చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడంలో కూడా టమాటా జ్యూస్ మేలు చేస్తుందని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు.

Also Read:ధూం ధాం..సెకండ్ సింగిల్

- Advertisement -