కేరళ కోసం: ఏ హీరో విరాళం ఎంతంటే?

213
KeralaFloods--Mega-Family-
- Advertisement -

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి కేరళ రాష్ట్రం వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలకు కేరళలో రోడ్లన్ని నదులని తలపిస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళలోని పలు వరద బాధిత శిబిరాల్లో లక్షలాది మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. ప్రకృతి విపత్తు వల్ల కుదేలైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. కేరళకు సాయాన్ని అందించేందుకు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ ముందుకొచ్చింది. కేరళ వరద బాధితులకు తమ వంతు సాయంగా 10 లక్షల రూపాయలను విరాళంగా అందించనున్నట్లు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా తెలిపారు.

vijay devarakonda

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్‌లు కూడా కేరళ వరద బాధితుల సహాయార్ధం 25 లక్షల విరాళం ప్రకటించారు. ప్రిన్స్‌ మహేష్‌బాబు సైతం తన వంతుగా వరదబాధితులకు 25 లక్షల రూపాయల సాయం ప్రటించారు. విజయ్‌దేవరకొండ 5 లక్షల సాయం ప్రకటించారు. రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన 10 లక్షల విలువైన మందులను కేరళకు సాయంగా పంపిచనున్నట్లు తెలిపారు. చిరంజీవి తల్లి అంజనమ్మ లక్ష రూపాయల విరాళం ప్రకటించారు.

kerala-flood

ఇప్పటికే ప్రభాస్ కోటి రూపాయల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చారు. తాజాగా దర్శకుడు కొరటాల శివ తనవంతు సాయంగా రూ. 3 లక్షల సాయాన్ని అందించారు. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సూర్య, కార్తీలు కూడా రూ. 25 లక్షలు అందజేశారు. మొత్తానికి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎప్పుడూ తామున్నామని ముందుకొచ్చే తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి తామున్నామని ధైర్యం చెబుతూ ముందుకొచ్చింది.

- Advertisement -