టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌పై కన్నేశారు. బాహుబలి తర్వాత తెలుగు ఇండస్ట్రీ హీరోలు పాన్ ఇండియా మూవీలపై దృష్టి సారించగా ఇప్పటివరకు విడుదలైన చిత్రాలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ముంబై చెక్కేస్తున్నారు హీరోలు.
ఇప్పటికే ప్రభాస్ ముంబైలో మకాం వేయగా తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ముంబైలో ఇల్లు కొన్నారు. చరణ్ భార్య ఉపాసన ఆయన టేస్ట్‌కు తగ్గట్లుగా ఇంటీరియర్ చేయించుకోగా ఇటీవలె గృహప్రవేశం కూడా చేశారు.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.