శర్వానంద్ వెడ్డింగ్ డేట్‌ ఫిక్స్‌

47
- Advertisement -

టాలీవుడ్‌ స్టార్ శర్వానంద్ పెళ్లి డేట్ ఫిక్స్‌ అయ్యింది. హైదరాబాద్‌కు చెందిన రక్షితారెడ్డి తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి ఎక్కడ జరుగుతుందని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసారు. కాగా రాజస్థాన్ జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ వీరిద్దరి వెడ్డింగ్‌కు వేదిక కానున్నట్టు సమాచారం. ఈ ప్యాలెస్‌లో రెండు రోజుల పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. జూన్‌ 2న మెహందీ ఫంక్షన్ నిర్వహించనున్నారు. జూన్‌ 3న వివాహ వేడుక జరుగనుంది. అయితే ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్లు సందడి చేయబోతున్నారట. ఇప్పటికే వెడ్డింగ్ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని టాలీవుడ్‌ టాక్.

Also Read: మహేష్ ఫ్యాన్స్.. టైటిల్స్ గోల!

ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నారు. శర్వానంద్ 35గా వస్తున్న ఈప్రాజెక్ట్‌లో ఉప్పెన క్రేజీ ఫేం కృతిశెట్టి ఫీమేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా…వివేక్ కూచిబోట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: హ్యాపీ బర్త్ డే..ఛార్మి

- Advertisement -