పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

8
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో భేటీ కానున్నారు టాలీవుడ్ నిర్మాతలు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం,పవన్ డిప్యూటీ సీఎంగా ఉండటంతో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనతో చర్చించనున్నారు నిర్మాతలు.

ప్రధానంగా సినిమా టికెట్ల రేట్ల,అదనపు షోల‌పై చర్చించే అవకాశం ఉంది. థియేటర్ల సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలన్నదానిపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. పవన్‌ను కలిసే వారిలో నిర్మాతలు అశ్వనీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్యలతో పాటు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదరప్రసాద్ ఉన్నారు.

Also Read:కేబినెట్ విస్తరణ..వీరికే ఛాన్సా!

- Advertisement -