టాలీవుడ్ న్యూఇయర్‌ ట్రీట్‌..!

291
Tollywood New year wishes
- Advertisement -

కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలతో కొత్త ఏడాదికి టాలీవుడ్ ఘనంగా స్వాగతం పలికింది.  ఫస్ట్‌లుక్‌లు, టీజర్‌లతో కొంతమంది అలరిస్తే మరికొంతమంది సరికొత్త లుక్‌లతో న్యూఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

వరుణ్‌ తేజ్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. ఈ సినిమాలో వరుణ్‌, రాశీ జంటగా ఉన్న తొలి లుక్‌ను న్యూఇయర్‌ సందర్భంగా చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది.  ఫిబ్రవరి 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు  రానుంది. బాలకృష్ణ-కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జై సింహా. ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. న్యూఇయర్‌ విషెస్ చెబుతు బాలయ్య ఫ్యాన్స్‌కి సర్‌ ప్రైజ్ ఇచ్చారు.

 Tollywood New year wishes
‘స్వీటీ’ అనుష్క టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భాగమతి’. అశోక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా న్యూఇయర్‌ను పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన మరో ప్రత్యేక పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. పోస్టర్‌లో అనుష్క ఓపక్కకు చూస్తున్నట్లు కన్పించారు.

 Tollywood New year wishes
ప్రముఖ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’.  ఆ రోజుల్లో రాముడు చేసింది తప్పే అయితే నేను చేసింది కూడా తప్పే’ అనే క్యాప్షన్‌తో మోహన్ బాబు లుక్ అందరిని ఆకట్టుకోగా తాజాగా న్యూఇయర్‌ ట్రీట్‌తో ముందుకువచ్చారు.

 Tollywood New year wishes  Tollywood New year wishes  Tollywood New year wishes  Tollywood New year wishes  Tollywood New year wishes

- Advertisement -