విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్

237
Its a wonderful victory :KCR
- Advertisement -

విద్యుత్ శాఖ ఉద్యోగులు రాష్ట్రంలోని రైతులతో పాటు అన్ని వర్గాలకు నూతన సంవత్సర ఆనందాన్ని రెట్టింపు చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ర్టానికి ఇంత గొప్ప ఖ్యాతిని సముపార్జించి పెట్టిన విద్యుత్ ఉద్యోగులకు జనవరి 2018 నుంచి వర్తించేలా ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్….విద్యుత్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

తెలంగాణ రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించడం మూడున్నరేళ్ల వయస్సున్న తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత విజయమని  అన్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే విధంగా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ ఉద్యోగులకే దక్కుతుందని కొనియాడారు. దేశమంతా తెలంగాణ వైపు చూసే విధంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించారు అని సీఎం ప్రశంసించారు.

Its a wonderful victory :KCR

విద్యుత్ శాఖ పనితీరు పట్ల తెలంగాణ ప్రజానీకమంతా తృప్తిగా, ఆనందంగా ఉన్నారని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో అన్ని రంగాలకు నిరంతరాయ విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా చరిత్రలో తెలంగాణ నిలిచిపోతుందన్నారు సీఎం. దశాబ్దాల పాటు రైతులు అనుభవించిన కరెంట్ కష్టాలకు శాశ్వత విముక్తి కలిగించాలనే లక్ష్యంతో వ్యయ, ప్రయాసలకోర్చి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని నిర్ణయించామని సీఎం చెప్పారు.

విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో మరింత ఆత్మైస్థెర్యాన్ని నింపుతుందన్నారు.

- Advertisement -