ఈ రోజుల్లో ఒక భాషకి సంబంధించి ఆడియన్స్ ను మెప్పించడమే దర్శకులకు పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది. అలాంటిది విదేశాల్లో ఇతర భాషల వారిని కూడా తెలుగు సినిమాలతో మెప్పించడమే అంటే మాటలా ? ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేశారు రాజమౌళి , సుకుమార్. అవును బాహుబలి ఫ్రాంచైజ్ తో రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పి వారి చేత ఔరా అనిపించుకున్నాడు. RRR తాజాగా జపాన్ లో విడుదలై అక్కడ కూడా పెద్ద హిట్ అనిపించుకుంది. ఆ తర్వాత రాజమౌళి అమెరికా వెళ్లి అక్కడ RRR స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొని తెల్ల వాళ్ళతో జేజేలు కొట్టిన్చుకున్నాడు.
ఇప్పుడు సుకుమార్ కూడా విదేశాల్లో తన సత్తా చాటుతూ దూసుకెళ్తున్నాడు. పుష్ప సినిమా డిసెంబర్ 8న రష్యా లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్యా వెళ్ళింది పుష్ప టీం. తాజాగా అక్కడ పుష్ప స్పెషల్ షో వేశారు. షో చూసిన రష్యన్ ఆడియన్స్ సుక్కు వర్క్ కి బన్నీ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు. దీంతో రాజమౌళి తర్వాత విదేశాల్లో సత్తా చాటుతున్న దర్శకుడిగా సుకుమార్ మంచి గౌరవం అందుకుంటున్నాడు.
నిజానికి ఇప్పుడున్న రోజుల్లో కంటెంట్ కి ఎలాంటి బ్యారియర్స్ లేవు. సినిమా బాగుంటే ఎక్కడినా ప్రదర్శించుకునే అవకాశం ఉంది. మరి రాజమౌళి , సుకుమార్ తరహాలోనే మిగతా దర్శకులు కూడా విదేశాల్లో ఇలా తమ సినిమాలతో సత్తా చాటితే సౌత్ సినిమా స్టామినా ఇంకాస్త పెరగడం ఖాయం. చూడాలి ప్రశాంత్ నీల్ , లోకేష్ కనగారాజ్ కూడా విదేశాల్లో రిలీజ్ లు , ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటారేమో.
ఇవి కూడా చదవండి…