తెలుగు సినిమాకు అరుదైన గౌరవం..

597
f2 movie
- Advertisement -

గత ఏడాది సంక్రాంతికి విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన తెలుగు చిత్రం ‘ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ప్రస్ట్రేషన్‌)’కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ‘ఇండియన్‌ పనోరమ’లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ సినిమా ఎంపికైంది. 50వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్సవాలు నవంబర్‌లో గోవాలో జరగనున్నాయి. ఈ ఫెస్టివల్‌లో ఎఫ్‌2 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

f2

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్‌ నిర్మించారు. ప్రతీ ఇంట్లో రెగ్యులర్‌గా జరిగే సన్నివేశాల నుంచే కామెడీ జనరేట్‌ చేసిన అనిల్‌.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేలా చేశాడు.

Anil Ravipudi

ఎఫ్‌2 చిత్రం ఐఎఫ్‌ఎఫ్‌ఐ-2019 ప్రదర్శనకు ఎంపిక కావడంపై దిల్‌ రాజ్‌, అనిల్‌ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -