‘శాతకర్ణి’ రికార్డులు బ్రేక్..టాలీవుడ్ ఫిదా

190
- Advertisement -

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ రిలీజైన కొద్ది గంటల్లోనే టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తూ…దుమ్ము రేపింది. కేవలం 4 గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. శాతకర్ణి ట్రైలర్‌తో బాలయ్య అభిమానుల దగ్గరి నుంచి టాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గరనుంచి.. కళ్యాణ్ రామ్, రాజమౌళి.. రామ్ గోపాల్ వర్మ,తమన్నా మొదలుకొని టాలీవుడ్ యావత్తు ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ట్రైలర్ ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. నందమూరి హీరోలైతే బాలకృష్ణను మునుపెన్నడూ చూడని విధంగా చూపించినందుకు దర్శకుడు క్రిష్‌ను ప్రశంసిస్తూ.. ట్రైలర్‌ లింక్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కొంతకాలంగా బాబాయ్-అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ట్రైలర్‌పై ఎన్టీఆర్ స్పందించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మామయ్య ట్రైలర్‌పై నారా లోకేష్ సైతం ప్రశంసలు గుప్పించాడు.

అద్బుతం.. తన బాబాయ్‌ నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ట్రైలర్‌ను ఉద్దేశించి హీరో ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ట్రైలర్‌ అద్భుతంగా ఉందన్నారు.

కళ్యాణ్ రామ్ ఇలా.. దేశం మీసం తిప్పుదాం.. ఎక్సట్రార్డినరీ ట్రైలర్ అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు.

మైండ్ బ్లోయింగ్ ఎనిమిది నెలల్లో మీరు సాధించింది మైండ్ బ్లోయింగ్ గా ఉంది. హ్యాట్యాఫ్ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నితిన్ ఈ చిత్రం ట్రైలర్ చూసిన వెంటనే సూపర్బ్ అంటూ ఇలా ట్వీట్ చేసి తన ఆనందం వ్యక్తం చేశారు.

బాలయ్య అల్లుడు నారా లోకేష్ తన మామయ్య తాజా చిత్రం ట్రైలర్ స్పందించాడు. శాతకర్ణి విజువల్ ట్రిట్ అని ట్విట్ చేసిన లోకేష్…బాలయ్య అద్భుతంగా నటించారన్నారు.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం ట్రైలర్ చూసి వెంటనే తన దైన శైలిలో స్పందించారు. తెలుగు సినిమా మరోసారి నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిందని ప్రశంసించారు.

 Tollywood Lauds NBK for his efforts

 Tollywood Lauds NBK for his efforts  Tollywood Lauds NBK for his efforts  Tollywood Lauds NBK for his efforts  Tollywood Lauds NBK for his efforts

- Advertisement -