జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరైయే ప్రముఖులు వీరే..

483
YS Jagan
- Advertisement -

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రేపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. విజయవాడ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 12.23గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని వైఎస్ జగన్ పలువురికి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.

YS Jagan

తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, డీఎంకే అధినేత స్టాలిన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీనటుడు చిరంజీవి, కాంగ్రెస్ నేత కేవీపీ రాంచందర్‌రావు, తదితరులకు ఫోన్ చేసి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. మంగళవారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసిన జగన్ తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతేకాదు టాలీవుడ్‌ నుండి మోహన్ బాబు, బాల‌కృష్ణ‌, అక్కినేని నాగార్జునతో పాటు ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు సమాచారం.

- Advertisement -