సిద్దిపేటలో ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణి చేసిన హరీష్ రావు

343
Former Minister Mla Harish Rao Distrubute Ramzan Gifts To Minaritys...
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 3లక్షల పేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండ మల్లయ్య గార్డెన్స్ లో మంగళవారం పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ సమక్షంలో ముస్లిం మైనారిటీలకు రంజాన్ కానుకలను ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తం రెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరూ హిందూ, ముస్లిం, క్రైస్తవులకు వారి వారి పండగల రోజున కొత్త బట్టలు ధరించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని, అందుకనుగుణంగా కొత్త దుస్తుల పంపిణీ చేస్తున్నామని వివరించారు. అలాగే ఈ నెల 31 రోజున సిద్ధిపేటలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో 300 ఇంగ్లీషు మీడియం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని., ప్రతి పేద ముస్లిం అమ్మాయిలను చదివించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అందరిని చదివించడం వల్లనే మీ జీవితాల్లో వెలుగు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సిద్ధిపేటలోని అర్హులైన పేదలందరికీ త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రభుత్వం పెంచిన పించన్లను అందిస్తామని చెప్పారు. సిద్ధిపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నిలిపేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, జేసీ పద్మాకర్ లతో కలిసి రంజాన్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అధికారి జీవ రత్నం, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, ప్రముఖ వ్యాపార వేత్త సయ్యద్ హమీదోద్దీన్, పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -