సినిమా సక్సెస్ అండ్ ప్లాప్ ను ఇప్పుడు డిసైడ్ చేస్తోంది సోషల్ మీడియానే. అందుకే.. చిన్న హీరో కిరణ్ అబ్బవరం నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకూ ప్రతి ఒక్కరూ భారీగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. తప్పు లేదు. ప్రమోట్ చేసుకోవడం కూడా ఈ రోజుల్లో ఓ కళే. కేవలం ప్రమోషన్స్ తో గ్లోబల్ స్టార్ గా చలామణి అయ్యే రోజులు ఇవి. కాబట్టి.. ప్రమోషన్స్ అనేవి.. ఈ డిజిటల్ లోకంలో తప్పనిసరి అయిపోయాయి. అయితే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది.
ప్రమోషన్స్ పేరుతో లేనిపోని బిరుదులు పెట్టేసుకుంటే.. వినడానికి అలాగే చూడడానికి కూడా అస్సలు బాగోదు. రీసెంట్ గా చరణ్ ను గ్లోబల్ స్టార్ అంటూ బాగా ప్రమోట్ చేశారు. సరే.. చరణ్, పైగా ఆర్ఆర్ఆర్ సినిమా పడింది. కానీ, ప్లాప్స్ లో ఉన్న హీరోలు కూడా తమ పేర్లు ముందు స్టార్లు అని వేసుకోవడమే విచిత్రం. ఈ విచిత్రంలో భాగంగా ఒక హీరో ఇప్పుడు తనను తాను ప్రామిసింగ్ స్టార్ గా ప్రమోట్ చేసుకుంటున్నాడు.
ఆ హీరోనే శ్రీనివాస్ బెల్లంకొండ. ప్రామిసింగ్ స్టార్ గా శ్రీనివాస్ బెల్లంకొండ తనను తానూ బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. పైగా తన సినిమాల గురించి కూడా గొప్పలు రాయించుకుంటున్నాడు. వైవిధ్యమైన థీమ్ లతో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాను అంటూ శ్రీనివాస్ బెల్లంకొండ తెగ సుత్తి కొడుతున్నాడు. ఏమిటో ఈ డప్పులు.
ఇవి కూడా చదవండి..