రెమ్యూనిరేషన్ పెంచాడు.. సబబే!

29
- Advertisement -

హిట్ 2 విజయం ముందు అడవి శేష్ వేరు. తరువాత అడవి శేష్ క్రేజ్ వేరు. ఈ తేడా ఇప్పుడు నిర్మాతలకు బాగా తెలుస్తోంది. విషయం ఏమిటంటే రెండు కోట్ల నుంచి నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ మార్క్ కు రీచ్ అయిపోయాడు అడవి శేష్. తన కొత్త సినిమా కోసం అడవి శేష్ రెమ్యూనిరేషన్ 4 కోట్లుగా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హిట్ 2 బ్లాక్ బస్టర్ అయింది అనేది అడవి శేష్ అభిప్రాయం. పైగా తన క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు, పీక్స్ అనేది అడవి శేష్ నమ్మకం. అందుకే, ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ను అడవి శేష్ రివైజ్ చేసినట్లు తెలుస్తోంది.

రెండు కోట్ల నుంచి 4 కోట్ల మేరకు ఫిక్స్ చేసినట్లు బోగట్టా. దీనికితోడు అదనపు ఖర్చులు ఉంటాయి. అడవి శేష్ లాంటి మ్యాటర్ ఉన్న హీరోకి నాలుగు కోట్లు ఇవ్వడంలో ఏ మాత్రం తప్పు లేదు. కాకపోతే.. గమ్తత్తేమిటంటే అంతకు ముందే ఒప్పుకున్న గూఢచారి 2 లాంటి సినిమాకు కూడా తన కొత్త రెమ్యూనిరేషన్ వర్తిస్తుంది అని అడవి శేష్ నిర్ణయం తీసుకోవడం తప్పు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక్క హిట్ రాగానే హీరోలు తమ రెమ్యూనిరేషన్ ను పెంచేస్తున్నారు.

కానీ, అడవి శేష్.. వరుసగా హిట్లు ఇస్తూ వస్తున్నాడు. పైగా సినిమా స్క్రిప్ట్ అండ్ నిర్మాణ వ్యవహరాలను కూడా దగ్గర ఉండి చూసుకోగలడు. పైగా తన కేటగిరీ హీరోల్లో మంచి మార్కెట్ ఉన్న హీరో కూడా అడవి శేషే. కాబట్టి.. శేష్ తన రెమ్యూనిరేషన్ పెంచడంలో ఏ మాత్రం తప్పు లేదు.

ఇవి కూడా చదవండి…

కనెక్ట్ పై నయనతార ముచ్చట్లు

బాలయ్యపై నయన్ షాకింగ్ కామెంట్స్‌!

హ్యాపీ బర్త్ డే…తమన్నా

- Advertisement -