Tollywood Drugs Case:వెలుగులోకి షాకింగ్ విషయాలు

56
- Advertisement -

టాలీవుడ్‌ని మరోసారి డ్రగ్స్ కేసు కుదిపేసింది. ఒకే పార్టీలో నాలుగు రకాల డ్రగ్స్ పట్టుబడటంతో అంతా షాక్‌కు గురయ్యారు. వెంకట్ బాలాజీ మురళి తో పాటు ఇద్దరు యువతులను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకోగా సినిమా లింకులతో ఉన్న డ్రగ్స్ పార్టీ అవ్వడం సంచలనంగా మారింది.

నైజీరియన్స్‌తో వీళ్లకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నట్టుగా వాళ్ల ద్వారానే డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా తేలింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొదట బాలాజీని అరెస్టు చేయగా మాదాపూర్‌లో నిర్వహిస్తున్న డ్రగ్స్ పార్టీ సమాచారం అందటంతో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళి అరెస్ట్ చేసి 2 యువతులని రిహాబిలిటేషన్ సెంటర్ కి తరలించారు.గతంలో నేవీలో ఉద్యోగం చేసిన బాలాజీ ఈ పార్టీకి మెయిన్ గా డ్రగ్స్ సప్లై చేశాడు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ నుంచి 2.8 గ్రాముల కోకైన్, 6 ఎల్ ఎస్ డి బోల్ట్, 25 ఎస్టాకి పిల్స్ , 72,000 నగదు, ఐదు సెల్ ఫోన్లు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. వెంకట్ సాయంతో సినీ పరిశ్రమలో పలువురు కీలక వ్యక్తులకు బాలాజీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో నలుగురు డ్రగ్ సప్లయర్లతోపాటు, ముగ్గురు నైజీరియన్లు ఉండగా సినిమాల్లో అవకాశం పేరుతో ఢిల్లీ నుంచి ఇక్కడికి యువతులను రప్పించి వాళ్ళతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

Also Read:వైష్ణో దేవి భక్తుడిగా స్టార్ హీరో

- Advertisement -