టాలీవుడ్ కి దీపికా పడుకోణె జ్వరం పట్టుకొంది. అందరూ ఆమె పేరు పలవరిస్తున్నారు. దాంట్లో ఉంది… దీంట్లో ఉంది… అంటూ మీడియా కూడా దీపికా పడుకోణె పేరుని లాగుతోంది. త్వరలో ప్రారంభం కానున్న పలు తెలుగు సినిమాల్లో దీపికా పడుకోణె పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోంది అంటూ కొత్తగా ప్రచారం అందుకుంది. ఐతే, ఈ సినిమా కన్నా ముందే మహేష్ బాబు సరసన రాజమౌళి సినిమాలో కూడా దీపికా పడుకోణెనే నటిస్తోంది అంటూ టాక్ నడుస్తోంది.
అలాగే రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో కూడా దీపికా పడుకోణెని అనుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు దీపికా పడుకోణెని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన పీరియడ్ చిత్రంలో ఆమె నటించే అవకాశం ఉంది. ఎప్పుడు డేట్స్ కావాలి అనే విషయంలో క్లారిటీ వస్తే దీపికా పడుకోణె ఒప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఐతే, దీపికా పడుకోణె ఈ సినిమాకి సైన్ చెయ్యలేదు.
Also Read: ‘శ్రీలీల’ గ్లామర్ వెనుక సీక్రెట్స్ ఇవే !
ఇప్పటికే దీపికా పడుకోణె, ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కె లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్టు ఈ సినిమాతో పాటు యశ్ సరసన కూడా ఒక సినిమాలో దీపికా పడుకోణె నటించే అవకాశం ఉందట. యశ్ సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ రావాలంటే బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ కావాలి. దీపికా పడుకోణె ఐతే బాగుంటుంది కదా అని సోషల్ మీడియాలో ఉన్న అభిమానుల ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: ఆదిపురుష్‌పై శివరాజ్ సింగ్ ప్రశంసలు..!