త్రివిక్రమ్ చూపు ఆమె పైనే

39
- Advertisement -

సీతా రామం మూవీలో సీతగా అమాయకంగా కనిపించిన మృణాల్‌ ఠాకూర్‌.. ఈ మధ్య బికినీలో కూడా అదరగొడుతుంది. పైగా అందాల దాడితో కురాళ్ళ మతులు పొగుడుతుంది. దాంతో ఇప్పుడు మృణాల్‌ ఠాకూర్‌ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంటున్న మృణాల్‌ ఠాకూర్‌ కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. సీతా రామం సినిమాతో ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో బలమైన కథలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

వరుసగా నాలుగు సినిమాలు చేరే సరికి లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ లైన్ కూడా మృణాల్‌ ఠాకూర్‌ కి తోడు అయింది. దీనికితోడు స్టార్ హీరోలు, దర్శకులు ఆమె వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో మృణాల్‌ ఠాకూర్‌ కు మరో భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం మృణాల్‌ ఠాకూర్‌ ను వెతుక్కుంటూ వచ్చిందని టాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

Also Read: అందరికీ దీపికా జ్వరం పట్టుకొంది

ఈ నేపథ్యంలో బన్నీ తన తర్వాత సినిమా పై ఫోకస్ పెట్టాడు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బన్నీ ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ హీరోయిన్లలో ఒకరిగా మృణాల్‌ ఠాకూర్‌ కు త్రివిక్రమ్ నుంచి పిలుపు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మృణాల్‌ ఠాకూర్‌ కు టాలీవుడ్ లో ఇక తిరుగుండదని అంటున్నారు. ఇప్పటికే మృణాల్‌ ఠాకూర్‌ క్రేజీ బ్యూటీగా చలామణి అవుతుంది.

Also Read: కస్టడీ నా కెరీర్ లో అత్యంత భారీ చిత్రం..

- Advertisement -